తిరుపతి జిల్లా నారాయణవరం మండలం వెత్తల తడుపు గ్రామంలోని దళితులు సాగు చేస్తున్న వ్యవసాయ భూమిపైకి పది మంది ఫారెస్ట్ సిబ్బందితో దౌర్జన్యం చేసిన ఫారెస్ట్ రేంజర్ మాధవి పై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాస నాగరాజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ 1975లో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం దళితులకు భూమి దక్కిందని వారు ఆ భూమిలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించి వ్యవసాయం చేసుకుంటున్నారని ఈ సమస్యపై 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ నేరుగా దళితులతో మాట్ల