గోకవరం: కెమికల్ ఆధారిత పరిశ్రమలను తరచూ తనిఖీలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు
జిల్లాలోని కెమికల్ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి, భద్రత ప్రమాణాలు, వాటినుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయి ని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి శనివారం ఆదేశాలు జారీ చేశారు . సంబంధిత అధికారులతో సమావేశం లో మాట్లాడుతూ పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించే లేదని హెచ్చరించారు. అస్సాగో, ఏపీ పేపర్ మిల్క్, ఠాగూర్ ల్యాబ్, ధరణి కెమికల్ వంటి పరిశ్రమలతో అన్ని పరిశ్రమలను సాంకేతిక అంశాలపై తనిఖీలు నిర్వహించి నివేదికల సమర్పించాలన్నారు.