యర్రగొండపాలెం: కేశినేని పల్లి గ్రామంలో టిడిపి నాయకులు సింగారయ్య భౌతిక కాయానికి టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు ఘన నివాళి
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి గ్రామంలో టిడిపి నాయకులు భీమిశెట్టి సింగారయ్య ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.