హైదరాబాద్ సిపి సజ్జనార్ మంగళవారం ఉదయం వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాధలుగా వదిలేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వీడియో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల బాగోగులు చూడడం బిడ్డల కనీస ధర్మమని ఇది చర్చలకు తావులేని వారి హక్కు అని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదు అని వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హింసించిన ఉద్దేశించేది లేదని వారిని కఠినంగా చట్టపరంగా శిక్షలు తప్పవు అని అన్నారు.