అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా దనోర లో సీపీఐ పార్టీ అభివృద్ధి కి సత్యనారాయణ కృషి అభినందనీయం:ప్రభాకర్ రెడ్డి
గత 45 ఏళ్లుగా సీపీఐ పార్టీలో భక్కి శివన్న నాయకత్వంలో పార్టీకి అనేక సేవలు అందించిన పెద్ది సత్యనారాయణ అకాల మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. భీంపూర్ మండలం దనోర గ్రామంలో ఆదివారం నిర్వహించిన కామ్రేడ్ పెద్ది సత్యనారాయణ సంస్కరణ సభలో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విలాస్, సట్వజీ, మేకల రవి తదితరులు ఉన్నారు.