తాడిపత్రి మండలం చుక్కలూరు సమీపంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లు ఆపరేటర్ గా పనిచేస్తున్న నాగేంద్ర పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు ఐదారు మంది గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ సబ్స్టేషన్ లోకి చొరబడ్డారు. కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారు. వెంటనే నాగేంద్రను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.