అమీర్పేట: దిల్సుఖ్నగర్ బాంబు దాడి కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దిల్సుఖ్నగర్ బాంబు దాడి కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ పోలీసులు చాలా కష్టపడి నిందితులను పట్టుకున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిందితులను ఉరిశిక్ష కంటే నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చివేయాలని అన్నారు.