ప్రకాశం జిల్లాలో మంతా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం పై కేంద్ర బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Nov 10, 2025
ప్రకాశం జిల్లాకు మంతా తుఫాన్ ధాటికి నష్టం వాటిల్లిన తీరును కేంద్ర కమిటీ బృందం సోమవారం పరిశీలించింది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో తుఫాను దాటికి నష్టపోయిన వివరాలను పూర్తిస్థాయిలో వివరిస్తూ ఫొటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనను కేంద్ర కమిటీ బృందం సందర్శించింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు ముందుగా కమిటీ బృందానికి స్వాగతం పలికారు.