కొండపి: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు ఆదివారం స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహన యజమానిని తల్లితండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిని హెచ్చరించారు. మైనర్లు నడిపిన వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదానికి మైనర్ కారణమైతే వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు వాహన యజమానులను హెచ్చరించారు.