ఆత్మకూరు: గోవిందం పల్లి వద్ద హైవేపై గేదెను ఢీకొట్టిన బైక్, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, గోవిందంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచలకోన వైపు నుంచి మైదుకూరు వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు గేదెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతనిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న సోమశిల పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి, తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.