మార్కాపురం: రాయవరం గ్రామంలో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం, మూడు లక్షల విలువైన వస్తువులు అపహరణ
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గ్రామంలో ఓ ఇంట్లో ఆదివారం దొంగతనం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వాడు వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు మూడు లక్షల విలువైన వస్తువులు దొంగతనం జరిగినట్టుగా యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.