అసిఫాబాద్: గోలేటి సీవీక్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బెల్లంపల్లి ఏరియా GM విఫలం:AITUC రీజియన్ అధ్యక్షుడు ఉపేందర్
బెల్లంపల్లి ఏరియా గోలేటి సీవిక్ కాంట్రాక్టు కార్మికులు గత 5 రోజుల నుండి 26 రోజుల పని దినాలు కల్పించాలని విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ పట్టించుకోవడంలేదని AITUC బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు భోగే ఉపేందర్ అన్నారు. సోమవారం గోలేటిలో మాట్లాడుతూ..గత ఐదు రోజుల నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్న బెల్లంపల్లి జీఎం పట్టించుకోవడంలేదని,బొగ్గు ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై లేదని అన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లకు ఏరియా జనరల్ మేనేజర్ ఊడిగం చేస్తున్నారని అన్నారు.