హిమాయత్ నగర్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.