పులివెందుల: పెద్ద రంగాపురంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఘనజీవామృతం తయారీ విధానాన్ని రైతులకు తెలియజేసిన మండల వ్యవసాయ అధికారులు
Pulivendla, YSR | Sep 17, 2025 పులివెందుల మండలం పెద్ద రంగాపురం గ్రామపంచాయతీలో ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణి చేసిన కంది పొలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి మాట్లాడుతూ కంది పంటలు తెగుళ్లు పురుగుల యజమాన్యపు పద్ధతుల్లో మెలకుల గురించి రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్ద రంగాపురం గ్రామంలో 75 మంది రైతులకు ఉచితంగా కందులు పంపిణి చేసినట్లు తెలిపారు. రైతులు ఖరీఫ్ లో సాగు చేసిన ప్రతి పంటను పంట నమోదు చేపించుకోవాలని తెలిపారు.