సిర్పూర్ టి: ఎస్ పి ఎం క్రీడా మైదానంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు స్మారక కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాల్వాయి
కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్ లో మాజీ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి పురుషోత్తమరావు 26వ వర్ధంతి సందర్భంగా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, కాగజ్ నగర్ డి.ఎస్.పి వాహిదూద్దీన్ ప్రారంభించారు. ప్రజా సేవకు అంకితమై ప్రజాసేవలోనే ప్రాణాలు కోల్పోయిన పాల్వాయి పురుషోత్తమరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ మొదటి మ్యాచ్ని ప్రారంభించారు,