జనగాం: తెలంగాణ రైతంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న BJP, RSS లను నిలదీయాలి:CPM జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరింస్తున్న బీజేపీ,ఆర్ఎస్ఎస్ లను నీలదీయాండని సిపిఎం జాతీయ కార్యదర్శి ఏం.ఎ. బేబీ పిలుపునిచ్చారు.బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సిపిఎం జాతీయ కార్యదర్శి ఏం.ఎ. బేబీ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు పట్టణంలోని కళ్లెం కమాన్ వద్ద పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్ నుండి బతుకమ్మ,కోలాటం ఆటలతో మరియు డప్పు కళాకారుల కోలాహలం మధ్య పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా ప్రెస్టన్ గ్రౌండ్ వరకు చేరుకున్నారు.