పీలేరులో ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఎటో వెళ్లిపోయింది. వీరి సమాచారం తెలిస్తే తెలపాలని పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ శుక్రవారం సాయంత్రం 6గంటలకు తెలిపారు. పీలేరు మండలం పీలేరు పట్టణం మోడల్ కాలనీలో నివాసం ఉండే ఎద్దుల వెంకట రమణ రెడ్డి కి భార్య ఎద్దుల కవిత (27)కు గురువారం రాత్రి చిన్న పాటి ఘర్షణ జరిగింది. ఇదిలావుండగా కవిత శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పీలేరు లోని VSN సిద్ధార్థ స్కూల్లో చదువుకుంటున్న తన ఇద్దరు పిల్లలు, హేమలత(10),జశ్వంత్ రెడ్డి(7) లను తీసుకుని కువైట్ లో ఉన్న తన అక్కకు ఫోన్ చేసి నేను నా పిల్లలు చనిపోతున్నాము అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటో వెళ్లిపోయింది.