మెదక్: కామరాం తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలన చేసిన ఎంపీడీవో దామోదర్
Medak, Medak | Sep 19, 2025 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలన చేసిన ఎంపీడీవో దామోదర్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం లోని కామారం తండాలో శుక్రవారం మధ్యాహ్నం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎంపీడీవో దామోదర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపడితే బిల్లులు సకాలంలో అందుతాయని సూచించారు. కొన్ని ఇల్లు పూర్తి కావొచ్చాయని మిగతా వారు కుడా తొందరగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం గ్రామంలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డును ఆయన పరిశీలించారు. నష్టపోయిన పంట వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు.