భీమడోలులో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం, పాల్గొన్న ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని
Eluru Urban, Eluru | Sep 27, 2025
ప్రధాని నరేంద్ర మోడీ విధానాలతో దేశం అగ్రరాజ్యల సరసన నిలిచిందని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలు రావిచెట్టు సెంటర్ లో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' నినాదంతో స్థానికులకు కూటమి నేతలు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈమేరకు జీఎస్టీ తగ్గింపుతో ఒక్కో కుటుంబానికి ఎంత మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందో, ఏఏ వస్తువు పై ఎంతమేర ధరలు తగ్గాయో గన్ని వివరించారు. కార్యక్రమంలో కూటమి నేతలు శేషపు శేషగిరి, కరణం పెద్దిరాజు, కరుటూరి ప్రసాద్, ప్రవీన్ పటేల్, శ్రీనివాసశాస్త్రి, ఆదిరెడ్డి సత్తిబాబు, తాటిమళ్ళ రామ్మూర్తి, అజయ్, యుగంధర్ పాల్గొన్నారు.