పులివెందుల: వేంపల్లిలోని దుర్గా గవిమల్లేశ్వరస్వామికి విశేష పూజలు, భారీగా తరలి వచ్చిన భక్తులు
Pulivendla, YSR | Oct 27, 2025 కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని వేంపల్లెలో వెలసిన శ్రీ దుర్గా గవి మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు దుర్భాక ప్రసాద్ శర్మ నేతృత్వంలో దుర్గా గవి మల్లేశ్వరుడికి ఉదయాన్నే అభిషేకం,తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ ఛైర్మన్ పినుపోలు రాఘవేంద్రప్రసాద్ తెలిపారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఆలయ ధ్వజ స్తంభం ఆవరణలో మహిళలు ఉదయాన్నే కార్తీక దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.ఉదయాన్నే స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు