యర్రగొండపాలెం: దోర్నాల చెక్ పోస్ట్ వద్ద శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లేందుకు పోటెత్తిన వాహనదారులు
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా గణపతి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. నల్లమల్ల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీస్ అటవీశాఖ సంయుక్తంగా విధులు కొనసాగిస్తున్నారు. అటు ఆర్టీసీ బస్సుల కొరత కారణంగా భక్తులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.