ఎన్టీఆర్ నగర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలిసిన వెంటనే నెల్లూరు ఎస్పీ అజిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆమె వెల్లడించారు. గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నామని ఆమె మీడియాకు వివరించారు.