అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా గుండి ఎక్స్ రోడ్డు వద్ద వేర్వేరుగా రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు పత్రాలు లేకపోవడంతో ట్రాక్టరలను పోలీస్ స్టేషన్కు తరలించి, ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.