ఖమ్మం అర్బన్: ఖమ్మంలో జర్నలిస్టులపై కేసులకు నిరసనగా ఆందోళన
జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులపై ఖమ్మం జిల్లా జర్నలిస్టులు గళమెత్తారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ జిల్లా బ్యూరో సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజు పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. టియుడబ్ల్యూజే టీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు ఐజేయు నేతలు సంఘీభావం ప్రకటించి, నిరసనలో పాల్గొన్నారు.