కుప్పం: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కుప్పం ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అనేక పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రముఖ కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేరుకున్నారు. ద్రవిడ వర్సిటీలో శనివారం 1M1B గ్రీన్ సిగ్నల్ అకాడమీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 15 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.