కర్నూలు: పెండింగ్ చలానాలు తక్షణం చెల్లించాలి : ట్రాఫిక్ సీఐ మనుషురుద్దీన్ వాహనదారులకు హెచ్చరించారు.
పెండింగ్ చలానాలు తక్షణం చెల్లించాలి : ట్రాఫిక్ సీఐ మనుషురుద్దీన్ వాహనదారులకు హెచ్చరించారు. ఆదివారం కర్నూలు నగరంలోని ఆర్.ఎస్. సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మనుషురుద్దీన్ మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి సంబంధిత ధృవీకరణ పత్రాలు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు.పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలను తక్షణం చెల్లించాలని హెచ్చరించారు. చలానాలు పెండింగ్లో ఉన్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నియమాలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.నిబ