గ్రామ, వార్డు కమిటీలతో పాటు అనుబంధ విభాగాల కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేసి, వైసీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం అందరూ ఐకమత్యంతో పనిచేయాలని ఆయన కోరారు.