ఢిల్లీలో బాంబు పేలుళ్ల ఘటనతో నెల్లూరు జిల్లాలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.. ప్రధాన బస్టాండ్లతో పాటు రైల్వేస్టేషన్లో అనువణువు తనిఖీలు చేస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లో సంతపేట సిఐ సోమయ్య ఆధ్వర్యంలో బాంబుస్కోడ్ తనిఖీలు చేపట్టింది. బయట ప్రాంతాల నుంచి జిల్లాకి వస్తున్న వారి వివరాలు సేకరించడంతోపాటు.. వారి బ్యాగులను తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ప్రయాణికులందరూ తమకు సహకరించాలని సోమయ్య కోరారు