శంకరంపేట ఏ: మాగి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
మాగి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన గుర్తు తెలియని వ్యక్తులకు OTP లు తెలపకూడదని, ఆకర్షణీయమైన ఆఫర్ ల లింక్ లపై క్లిక్ చేయవద్దని సొసైటీ ఫర్ సోషల్(SST) ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకులలో అందించే సేవలు, పొదుపు, సైబర్ నేరాలు, ఏటీఎం ఉపయోగాలు, డిజిటల్ పేమెంట్స్, భీమా పథకాలు PMSBY, PMJJBY, APY, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో NDCCB అధికారి భిక్షపతి,DC శ్రీనివాస్,కార్యదర్శి భారతి, SST కౌన్సిలర్లు ఉన్నారు.