ప్రకాశం జిల్లాలోని 16 నెంబర్ జాతీయ రహదారిని మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేషనల్ హైవే అధికారులతో కలిసి సందర్శించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి రోడ్డు ప్రమాదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు. అలానే రానున్న రోజుల్లో హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ద్విచక్ర వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తామని ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ తెలిపారు.