రోడ్డు ప్రమాదంలో కదిరికి చెందిన ముతవల్లి అల్లా బకాష్ మృతి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవళి కాలనీకి చెందిన అబూబకర్ మజీద్ ముతవల్లి అల్లా బకాష్ ఆదివారం ఓబుల దేవర చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుడి కి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.