డ్రగ్స్ మరియు గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు.గురువారం రాత్రి 7 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మాదకద్రవ్యాలు మరియు గంజాయి నియంత్రణ చర్యలుఅవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోలీసు వారితో సమన్వయం చేసుకుని డ్రగ్స్ మరియు గంజాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నరు.