మంత్రాలయం: కంబళదిన్నె నుంచి ఎమ్మిగనూరు వరకు రోడ్డు వేయాలని సీపీఐ ఆధ్వర్యంలో కంబళదిన్నె గ్రామం వద్ద రాస్తారోకో
పెద్ద కడబూరు :కంబళదిన్నె నుంచి ఎమ్మిగనూరు వరకు రోడ్డు వేయాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం కంబళదిన్నె గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు భాస్కర్ యాదవ్, వీరేశ్ మాట్లాడుతూ.. కంబళదిన్నె నుంచి ఎమ్మిగనూరు రహదారి గుంతలమయంగా మారిందన్నారు. ఇందులో ప్రయాణం వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని తెలిపారు. తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మరియు గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు.