శ్రీకాకుళం: పాతపట్నం నుంచి ఒడిస్సా వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఉన్న రెస్టారెంట్లో చెలరేగిన మంటలు,రెండు లక్షల మేర ఆస్తి నష్టం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం లోని ఓ ప్రైవేటు రెస్టారెంట్లో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు మంటలు చెలరేగాయి పాతపట్నం నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీనిని చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒడిస్సా నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.. 2 లక్షల రూపాయలు మేరా ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు..