సత్తుపల్లి: సత్తుపల్లి,వేంసూరు మండలాలలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను పరిశీలించిన తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంసూరు మండలాలలో వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లను తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు మాట్లాడుతూ లిఫ్ట్ లకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వారం రోజుల లోపు రెండు మోటార్స్ మొదలయ్యేలా పనులు జరుగుతున్నాయి అన్నారు. మండల పరిధిలోని మిగిలిన కాలువలు కూడా పూర్తిగా పూడికలు తీసుకునేలా రైతులు చొరవ తీసుకోవాలని కోరారు.