గిద్దలూరు: కొమరోలు మండలంలోని అలీనగరం పామూరు పల్లి గ్రామాలలో పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అల్లినగరం, పామురుపల్లి గ్రామాలను మంగళవారం వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ ఆధ్వర్యంలో రైతులకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా రైతులు బొప్పాయి పండు సాగులో కాండం కుళ్ళు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించి చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే మీ స్థానిక రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలని మంచి దిగుబడును సాధించేందుకు ఎప్పటికప్పుడు అధికారులు ఇస్తున్న సూచనలు పాటించాలని రాజశ్రీ రైతులకు తెలిపారు.