మార్కాపురం: దీపావళి క్రాకర్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఎస్ వి త్రివినాగ్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా సుమారు 17 క్రాకర్స్ దుకాణాలను ఏర్పాటు చేశారు. క్రాకర్స్ అధిక రేటుకు విక్రయిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్ స్పందించి పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిబంధనలు మేరకే విక్రయాలు జరపాలని అధిక రేట్లకు విక్రయిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను సబ్ కలెక్టర్ హెచ్చరించారు.