పాలకీడు: జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలన చేసిన నేటి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నీటి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం కి జోహార్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశామన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల ఎకరాలకు సాగు అందుతుందని అన్నారు. పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పనులు పూర్తి అయితే ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.