టేక్మల్: భారీ వర్షాలతో కొట్టుకపోయిన వరి పంట ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన
Tekmal, Medak | Sep 15, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం చల్లపల్లి గ్రామంలో వరద నీటి ప్రవాహానికి వరి పంట కొట్టుకపోయింది.గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పంటపొలం కొట్టుకపోయిందని రైతు కిష్టయ్య సోమవారం నాడు వాపోయారు.తన మూడు ఎకరాల పొలంలో నుంచి వరదనీరు ప్రవహించిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.వర్షాలకు వరదలకు రెండుసార్లు పంట పొలం కొట్టుకుపోయి ఇసుక దిబ్బ ఏర్పడిందని పేర్కొన్నారు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయినట్టు తెలిపారు ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.