మేడిపల్లి: కథలాపూర్ మండలం ఫోటోగ్రాఫర్ల సంఘ అధ్యక్షుడిగా బొమ్మెన గ్రామానికి చెందిన గుండేటి సురేష్ ఎన్నిక, ఘనంగా సన్మానం
కథలాపూర్ మండల ఫోటోగ్రాఫర్ల సంఘ అధ్యక్షుడిగా బొమ్మెన గ్రామానికి చెందిన గుండేటి సురేష్ రెండు రోజుల క్రితం ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మండల కేంద్రంలో మండల ఫోటోగ్రాఫర్ల సంఘ సమావేశం నిర్వహించారు ,నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా చిలివేరి శ్రీకాంత్ కార్యదర్శిగా మచ్చ శేఖర్, డైరెక్టర్గా అందే గోవర్ధన్, సలహాదారులుగా కట్టెకోల సతీష్, జక్కని గంగ ప్రసాద్ ఎన్నికైనట్టు తెలిపారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పెరుగుతున్న టెక్నాలజీతో ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు.