సంగారెడ్డి: గణేష్ నగర్ లో సిసి రోడ్లు మురుగు కాలువలు నిర్మించాలని కోరుతూ మున్సిపల్ డి ఈ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ డీఈ రఘుకు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ రోడ్లు, మురుగు కాలువలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, నరసింహులు పాల్గొన్నారు.