బండి ఆత్మకూరు మండలం ఓంకారం పుణ్యక్షేత్రం పరిసరాల్లో, గురువారం చిరుత సంచరిస్తూ స్థానికులకు కనిపించింది. ప్రజలు కేకలు వేయడంతో అది అడవిలోకి వెళ్లింది. పదిహేను రోజుల నుంచి చెంచు కాలనీలోని కుక్కలపై చిరుత దాడి చేస్తోందని గూడెం వాసులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి, ఓంకారం క్షేత్రం సమీపంలో ,నాయిని చెరువు ప్రాంతంలో చిరుత సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని గూడెం వాసులు కోరుతున్నారు.