గన్నేరువరం: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని జంగంపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు....
జంగపెల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుళ్ల నడుమ శివ సత్తుల పూనకాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలతో తెచ్చిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో గ్రామం తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్టు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంబేద్కర్ సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు.