మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఎడ్ల పందాల పోటీల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆహ్వాన పత్రం అందజేశారు.