గుంతకల్లు: గుత్తి మండలం లచ్చానుపల్లి గ్రామంలో వైభవంగా పెద్దమ్మ, సుంకలమ్మ ఊరు జాతర, కిక్కిరిసిన గ్రామంలోని విధులు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని లచ్చానుపల్లి గ్రామంలో బుధవారం పెద్దమ్మ, సుంకలమ్మ ఊరు జాతరను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కుబడి ఉన్న వారు పెద్దమ్మ, సుంకలమ్మ తల్లికి బోనాలను తలపై ఉంచుకొని మేళతాళాలతో ఆలయం వరకూ వెళ్ళి అమ్మవార్లకు సమర్పించారు. ఆలయంలో వేకువజాము నుంచి అభిషేకాలు, ఆకుపూజ, మహామంగళ హారతి, అర్చన, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో జాతర సందర్భంగా అంగళ్లు, ఊయలలు ఏర్పాటు చేశారు. గ్రామానికి భారీగా తరలిరావడంతో విధులు కిక్కిరిసాయి.