ప్రొద్దుటూరు: నీటి మడుగులో విద్యుత్ కార్యాలయం
Proddatur, YSR | Sep 17, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు విద్యుత్ కార్యాలయానికి వెళ్లాలంటే నీటి మడుగులో ప్రజలు కార్యాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.పవర్ హౌస్ ప్రాంగణంలో కొద్దిపాటి వర్షానికి సైతం నీళ్లు నిలుస్తున్నాయి. ఈ ప్రాంగణంలోనే విద్యుత్ శాఖ ఈఈ, డీఈఈ, ఏఈ, ఈఆర్వో, సబ్ స్టేషన్, వినియోగదారుల సేవా కేంద్రం, విద్యుత్ బిల్లుల కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజలు నీటి మడుగుతో ఇబ్బంది పడుతున్నారు.వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.