సత్తుపల్లి: తరుగు పేరుతో ధాన్యం తీసుకున్నారని పెనుబల్లిలో గ్రామ దీపిక ఇంటి ముందు రైతుల ఆందోళన.
ఖమ్మం జిల్లా పెనుబల్లి లోని ఓ గ్రామ దీపిక ఇంటి ముందు రైతులు ఆందోళనకు దిగారు.ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో వేసిన నెల రోజుల తర్వాత తరుగు పేరుతో క్వింటాన్నార తక్కువగా నమోదు చేస్తుండటంతో రైతులు గ్రామీ దీపిక ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు నెల రోజుల క్రితం 293 బస్తాల ధాన్యాన్ని ఐకెపి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు.కాంటా పూర్తయిన నెలరోజుల తరువాత మరో క్వింటన్నారా తరుగు పేరుతో ధాన్యాన్ని తీసినట్లు తెలియడంతో రైతులు ఆందోళన చేపట్టారు..