మెడికల్ కళాశాల నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సవాల్
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు లోని మెడికల్ కళాశాల నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బడేటి చంటి సవాల్ విసిరారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను ఎమ్మెల్యే బడే చంటి పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి తమ హయాంలో మెడికల్ కాలేజీలు నిర్మించామని కేకులు కట్ చేయగా ఎక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశారో నిరూపించాలని ప్రతి సవాల్ విసిరారు. 2014 లోనే ఏలూరు లో మెడికల్ కాలేజీ నిర్మాణానికి అప్పటి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.