భీమిలి: కళాశాల ఆరవ అంతస్తు పై నుండి దూకి విద్యార్థి మృతి
గీతం మెడికల్ కళాశాలలో దారుణ ఘటన బుధవారం చోటు చేసుకుంది. విశాఖ గీతం మెడికల్ కాలేజ్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల బిల్డింగ్ ఆరవ అంతస్తుపై నుండి దూకి మృతి చెందాడు. మృతుడు 20 ఏళ్ల విస్మాద్, హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడిగా గుర్తించారు.సంఘటనతో క్యాంపస్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అధికారులు అందించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.