ఉపాధి హామీ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఉపసంహరణ చేసుకోవాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని డ్వామా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లప్ప ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.